మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య మూవీ..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీయ్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమా రిలీజైన తరువాత బాలయ్య తన నెక్స్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయనున్నాడు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా తరువాత బాలయ్య తనకు మంచి విజయాన్ని అందించిన ఓ యంగ్ డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలపబోతున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ‘వీరసింహా రెడ్డి’ వంటి పవర్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో మరోసారి సినిమా చేస్తానని బాలయ్య గతంలో తెలిపారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయట. ఇప్పటికే బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నాడని.. త్వరలోనే దీనిని బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకోవాలని చూస్తున్నట్లుగా టాక్. అయితే, బోయపాటితో సినిమా తరువాతే బాలయ్య ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్‌పై ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version