యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ – 1, సెప్టెంబర్ 27, 2024 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను నిన్న మేకర్స్ తెలుగుతో పాటుగా, మిగతా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల చేశారు.
ఈ ట్రైలర్ సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 55 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఇక ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ల పై చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.