మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’పై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా తరువాత తారక్ తన నెక్స్ట్ మూవీని ఇప్పటికే లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరుపుకున్న ఈ సినిమా కోసం ఈ చిత్ర సంగీత దర్శకుడు ఓ శాంపిల్‌కే శాంపిల్ వదిలి ఇప్పుడు ఈ సినిమాను హాట్ టాపిక్‌గా మార్చేశాడు.
ఇటీవల ఎన్టీఆర్ కర్ణాటకలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ రవి బస్రూర్‌కి చెందిన మ్యూజిక్ స్టూడియోను విజిట్ చేశాడు. ఈ విజువల్స్ అన్నీ కలిపి రవి బస్రూర్ ఓ సాంగ్ కంపోజ్ చేశాడు. ఇది కేవలం తన స్టూడియోలోని వారి మాత్రమే ఎన్టీఆర్‌పై అభిమానంతో కంపోజ్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. కేవలం స్టూడియో విచ్చేసినందుకే ఇలాంటి మ్యూజిక్‌తో వీడియో చేస్తే.. ఇక ఎన్టీఆర్-నీల్‌కు రవి బస్రూర్ అందించే సంగీతం ఊహాతీతం అంటున్నారు ఆయన అభిమానులు. ఏదేమైనా ఇది ఎన్టీఆర్-నీల్ మూవీ శాంపిల్‌కే శాంపిల్ అని వారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.