రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో ఓ చిన్న చిత్రం “కమిటీ కుర్రోళ్ళు” కూడా ఒకటి. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్ తదితర యువ నటీనటులతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యి అదరగొట్టింది.
మరి ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా ఇప్పుడు నేటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఈటీవీ విన్ లో అయితే వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై నిర్మించి తీసుకొచ్చారు.