మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకుడు అంజి కే మణిపుత్ర తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమే “ఆయ్”. మరి గోదావరి జిల్లా నేపథ్యంలో తెరకెక్కి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి సాలిడ్ వసూళ్లతో మేకర్స్ కి లాభాలు కూడా తెచ్చి పెట్టింది.
అయితే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం చూస్తున్న ఆడియెన్స్ కి అయితే ఫైనల్ గా గుడ్ న్యూస్ వచ్చేసింది అని చెప్పాలి. ఈ చిత్రం నేటి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఒక్క హిందీ మినహా మిగతా పాన్ సౌత్ భాషల్లో అయితే ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునే వారు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించారు.