వరద బాధితులకు 100 డ్రీమ్స్ ఫౌండేషన్ బాసట

 

”జెట్టి” సినిమా హీరో కృష్ణ మానినేని ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరిట గత 8 సంవత్సరాలుగా అనేక సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో సంభవించిన అకాల వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణ మానినేని మరియు టీం విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలను అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన స్వయంగా 100 డ్రీమ్స్ ఫౌండర్‌ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృష్ణ మానినేనిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు.

ఈ నేపథ్యంలో ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ కార్యక్రమాలను ఆయన శ్రద్ధగా విని, వాకి ప్రయత్నాలను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో వాళ్లు మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలని ప్రోత్సహించారు. అనంతరం వరద బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ మానినేని ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అందజేయడం జరిగింది.

Exit mobile version