దేవర ‘ఆయుధ పూజ’కు రంగం సిద్ధం

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ మేనియా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ మాసివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అటు సాంగ్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే, ఈ సినిమాలో ‘ఆయుధ పూజ’ సాంగ్ ఉంటుందని.. అది సినిమాకే హైలైట్ కాబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి. దేవర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కి రెండు వారాల సమయం ఉంది. అయితే, వచ్చే వారంలో ‘ఆయుధ పూజ’ సాంగ్ రానుందని.. ఇది పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాస్ట్ అవుతుందని ఆయన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ‘ఆయుధ పూజ’ ట్రాక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ఇక ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ‘ఆయుధ పూజ’ సాంగ్ ట్రాక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

Exit mobile version