ఓటిటిలో “శివం భజే” కి భారీ రెస్పాన్స్.!

 

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో అశ్విన్ బాబు హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా దర్శకుడు అబ్దుల్ అప్సర్ హుస్సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఫాంటసీ చిత్రం “శివం భజే” కూడా ఒకటి. హిడింబ లాంటి క్రేజీ థ్రిల్లర్ తర్వాత అశ్విన్ బాబు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పలకరించగా ఈ చిత్రం థియేటర్స్ లో కంటే ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది.
ఇక ఈ చిత్రం ఓటిటి యాప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే ఆహా లలో స్ట్రీమింగ్ కి రాగా వీటిలో ఈ సినిమా ఏకంగా 150 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. అలాగే ప్రైమ్ వీడియోలో అయితే ఇండియా వైడ్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలో నెంబర్ 6వ స్థానంలో ఈ చిత్రం ట్రెండ్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి వికాస్ బాడిస సంగీతం అందించగా గంగ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
Exit mobile version