బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమైన విక్రమ్ “కోబ్రా”


కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా. 2022 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ గా ఓటిటి లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జీ సినిమాలు ఛానెల్ లో సెప్టెంబర్ 21 వ తేదీన సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం కానుంది. శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్,రోషన్ మాథ్యూ, సర్జనో ఖాలిడ్, మిర్ణాలిని రవి, కే.ఎస్. రవి కుమార్, ఆనంద రాజ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version