ఈమధ్య కాలంలో ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు – మెగాస్టార్ చిరంజీవి


శ్రీ సింహ కోడూరి ప్రధాన పాత్రలో, దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. ఈ చిత్రానికి తొలి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్ల కి పరుగులు తీస్తున్నారు ఆడియెన్స్. ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.

నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి.
అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది
చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. హ్యాట్సాఫ్ రితేష్ రాణా.

నటీ నటులకు సింహ కోడూరి కి, ప్రత్యేకించి సత్య కి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవ లకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు. చివరిగా, డోంట్ మిస్ మత్తు వదలరా 2 అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version