అనిరుధ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఎన్టీఆర్!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ మహిళా కథానాయికగా నటించింది. యానిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, దేవర చిత్రం కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం పై ప్రశంసల వర్షం కురిపించారు.

దేవర చిత్రం హాలీవుడ్ స్కోర్ క్వాలిటీకి తక్కువ ఏమీ లేదు. అనిరుధ్ త్వరలో హాలీవుడ్‌లో తన సత్తా చాటుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల కి సానుకూలంగా స్పండిస్తూ, ఇటీవల విడుదల చేసిన “రెడ్ సీ” ట్రాక్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని హైలైట్ చేశారు. అనిరుద్‌పై ప్రశంసలు రావడం పట్ల అభిమానులు థ్రిల్‌గా ఉన్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్‌లతో పాటు, ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, షైన్ టామ్ చాకో, తారక్ పొన్నాడ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.

Exit mobile version