‘ఓ పిల్లో..’ సాంగ్ ప్రోమో.. మెకానిక్ రాకీ నుంచి రానున్న డ్యుయెట్ నెంబర్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ మెకానిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘ఓ పిల్లో’ అంటూ సాగే డ్యుయెట్ నెంబర్‌ను సెప్టెంబర్ 18న ఉదయం 11.11 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇక ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version