కపిల్ శర్మతో ఎన్టీఆర్.. స్పెషల్ స్ట్రాటజీ

పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమా ఫీవరే కనిపిస్తుంది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కూడా సరికొత్త రికార్డులను దేవర బద్దలు కొడుతుందని క్రిటిక్స్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దేవర టీమ్ నార్త్ లో బలమైన ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ మీడియాలతో ఇంటరాక్ట్ అవుతున్న ఎన్టీఆర్.. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లనున్నాడు. ఐతే, ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ షోలో దేవర టీమ్ చేసిన సందడి, ముఖ్యంగా కపిల్ శర్మ – ఎన్టీఆర్ మధ్య సాగిన ముచ్చట్లు.. మధ్యమధ్యలో వచ్చే కొన్ని కామెడీ స్కిట్స్ అండ్ పంచ్ లు చాలా బాగా వచ్చాయని.. నార్త్ ప్రేక్షకులను ఇవి ఎంతగానో అలరిస్తాయని తెలుస్తోంది.

కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేసిన ఇంటర్వ్యూ నార్త్ లో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తమ్మీద దేవర ఊచకోతకి ఏ రికార్డులు నిలబడేలా లేవు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version