‘నాన్న’ పాటతో వస్తున్న ‘మా నాన్న సూపర్ హీరో’

నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాను క్లీన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ‘నాన్న’ సాంగ్‌ను తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రానుంది. కాగా, ఈ సినిమాలో ‘నాన్న’ వీడియో సాంగ్‌ని సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తుండగా సాయి చంద్, షాయాజి షిండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి జేక్రిష్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version