యూఎస్ లో ఆగని “దేవర”.. మరో ఫాస్టెస్ట్ ఫీట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల దగ్గరకి వస్తుండగా ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రిలీజ్ కి ముందే యూఎస్ మార్కెట్ లో దేవర బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ని అయితే ఈ సినిమా అందుకుంది.

ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్న ఈ చిత్రం ఇపుడు ఏకంగా 1.75 మిలియన్ డాలర్లు మార్క్ ని ఇంకా 10 రోజులు ఉండగానే కొట్టేసింది. ఇది మాత్రం సెన్సేషన్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version