తన డైరెక్షన్ లో ధనుష్ నుంచి మరో సినిమా.!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 80వ సినిమాగా “రాయన్” తో సాలిడ్ హిట్ ని తాను అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత ధనుష్ మరోసారి ఫుల్ ఫామ్ లో ఉండగా తెలుగు సహా తమిళ్ సినిమాలు తాను చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా తన దర్శకత్వంలోనే మరో సినిమా అనౌన్స్ కావడం జరిగింది. తన కెరీర్ 52వ సినిమాగా కోలీవుడ్ నుంచి కొత్త నిర్మాణ సంస్థ డాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనౌన్స్ చేసేసారు.

మరి దీనితో ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో తన దర్శకత్వం నుంచి రాబోతున్న నాలుగో సినిమాగా ఇది నిలిచింది. మరి ఈ చిత్రాన్ని ధనుష్ ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కించనున్నాడో చూడాలి. ఇక ప్రస్తుతం ధనుష్ మన తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములతో “కుబేర” అనే సినిమా చేస్తుండగా ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక మందన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అతి త్వరలోనే రిలీజ్ కానుంది.

Exit mobile version