‘మ్యాడ్ స్క్వేర్’ సాలిడ్ అప్డేట్‌కు రంగం సిద్ధం

టాలీవుడ్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు హీరోలుగా నటించారు. యూత్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ గతంలోనే వెల్లడించారు.

అయితే, ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘మ్యాడ్ స్క్వేర్’ సీక్వెల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ రేపు ఉదయం 11.07 గంటలకు ఉండబోతుందని వారు తెలిపారు. దీంతో అభిమానులు ఈ సినిమా సీక్వెల్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version