తమిళ డైరెక్టర్‌ను వేడుకున్న ఎన్టీఆర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్ర తమిళ ప్రమోషన్స్ కోసం చెన్నైలో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు ‘దేవర’ టీమ్. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తమిళ మీడియాతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

ఇక ఈ ప్రెస్ మీట్‌లో తారక్ ‘దేవర’ మూవీ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూవీ అని.. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషిస్తున్నానని తారక్ తెలిపాడు. ఈ క్రమంలోనే తారక్ తన అభిమాన డైరెక్టర్‌ను ఓ కోరిక కోరాడు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్ తనతో ఓ సినిమా చేయాలని.. అది స్ట్రయిట్ తమిళ్ సినిమా అయినా ఓకే అని.. తరువాత తెలుగులోకి డబ్ చేసుకుందామని తారక్ వేడుకున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తనకు వెట్రిమారన్ అంటే ఎంత ఇష్టమో ఈ సందర్భంగా తారక్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని అభిమానులు అంటున్నారు.

Exit mobile version