‘దేవర’ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోలు.. ఎవరంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ మేనియాతో టాలీవుడ్ ఊగిపోతుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజులు సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ దేవర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలోనే దేవర ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్‌లో దేవర ప్రమోషన్స్ పూర్తవగా, ఇప్పుడు తెలుగులో ఈ ప్రమోషన్స్ గ్రాండ్‌గా జరిపేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఓ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు పలు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలతో ఈ సినిమాకు సాలిడ్ బజ్ తీసుకురానున్నారు.

ఇందులో భాగంగానే తారక్‌ను ఇద్దరు యంగ్ హీరోలు కలిసి ఇంటర్వ్యూ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కలిసి జూ.ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version