“RC 16” ఫస్ట్ లుక్ ఊహించని లెవెల్లో ఉండబోతుందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మావెరిక్ దర్శకుడు శంకర్ తో భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత చరణ్ తన కెరీర్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేయనున్నాడు. మరి ఆల్రెడీ అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం మొదటి నుంచి కూడా క్రేజీ హైప్ ని తెచ్చుకుంది.

ఈ సినిమా కథ విన్న పాన్ ఇండియా నటులు టెక్నీషియన్స్ సైతం ఈ సినిమా మామూలు లెవెల్లో ఉండదు అంటూ చెప్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ గా చరణ్ కూడా బీస్ట్ మోడ్ లోకి మారుతున్నట్టుగా తెలిపిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా చరణ్ ఈ సినిమాకి ప్రిపేర్ చేసే ఫస్ట్ లుక్ పై క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం చరణ్ గతంలో ఎప్పుడూ లేని కొత్తదైన పవర్ఫుల్ లుక్ ని ప్రిపేర్ చేయబోతున్నాడట.

అది తన దేహం పరంగా అలాగే తన ముఖం పరంగా కూడా సాలిడ్ లుక్ ని చేయబోతున్నాడట. ఆల్రెడీ బుచ్చిబాబు ఓ లుక్ ని అనుకోగా ఈ లుక్ లోకి చరణ్ మారే ప్రయత్నంలో ఉన్నాడు. ఇలా ప్రస్తుతానికి ఈ ఫస్ట్ విషయంలో మాత్రం టాలీవుడ్ లో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి మేకర్స్ ఎలాంటి ఫస్ట్ లుక్ ని వదులుతారో వేచి చూడాలి.

Exit mobile version