Kanguva: ‘కంగువా’.. సాలిడ్ అప్డేట్ వచ్చేస్తోంది!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’(Kanguva) ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తొలుత ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘కంగువా’ మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త వచ్చేస్తోంది..’ అంటూ వారు అనౌన్స్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 19న ఉదయం 11 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు వారు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ దిషా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version