Devara: దేవర కథపై చర్చ.. ఇది అదేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మూవీ దేవర(Devara) మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్(NTR) ఇందులో డ్యుయెల్ రోల్‌లో నటించాడు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవర మూవీ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ వచ్చినా నెటిజన్లు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ‘దేవర’ కథ ఇదేనంటూ ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఆ కథ గురించి తెలుసుకుని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. దేవర సినిమా కథలో శ్రీకాంత్ అతడి గ్యాంగ్ అక్రమ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారి ప్రత్యర్థిగా సైఫ్ అలీ ఖాన్ వారిపై విరుచుకుపడుతుంటాడు. అయితే, శ్రీకాంత్ గ్యాంగ్‌కు అండగా నిలుస్తాడు దేవర. దీంతో సైఫ్ అలీ ఖాన్ దేవరను అంతమొందించేందుకు శ్రీకాంత్‌తో చేతులు కలుపుతాడట. కట్ చేస్తే.. తన తండ్రికి జరిగిన అన్యాయంపై పిరికివాడైన ఎన్టీఆర్ నిజాలు తెలుసుకుని, తన తండ్రి మరణంపై పగ తీర్చుకుంటాడట.

ఇదే దేవర సినిమా కథ అంటూ వార్తలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇక ఈ కథ గతంలో వచ్చిన ఆంధ్రావాలా, గోపీచంద్ నటించిన భీమ చిత్రాలకు దగ్గరగా ఉందని కొందరు నెటిజన్లు అంటుంటే.. ఎలాంటి కథ అయినా ‘దేవర’కు ఎన్టీఆర్ ఒక్కడు చాలని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ‘దేవర’ ముంగిట ఇలాంటి పుకార్లను తాము నమ్మమని వారు చెబుతున్నారు. మరి దేవర కథ ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమాను థియేటర్లలో చూడాల్సిందే అని వారు పేర్కొన్నారు.

Exit mobile version