పిక్ టాక్: ఉప్పెన వచ్చినా ‘దేవర’ ప్రేమ తగ్గదు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ ప్రస్తుతం ది మోస్ట్ ట్రెండింగ్ సినిమాగా మారింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వదులుతూ మేకర్స్ ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా ఉంచుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని పలు మూవీ స్టిల్స్ వదులుతూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నారు.

ఇందులో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల ‘చుట్టమల్లె’ సాంగ్‌లోని ఓ స్టిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెనకాల సముద్రం ఉప్పెంగేలా ఉన్నా, ఎన్టీఆర్-జాన్వీల ప్రేమ మాత్రం తగ్గదు అనేలా ఈ స్టిల్ ఉండటం యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version