NBK 109: బాలయ్య 109లో మరో మైండ్ బ్లాకింగ్ సీక్వెన్స్?

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది వస్తుండగా హైప్ ఈ సినిమాపై గట్టిగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఒకింత తక్కువే వస్తున్నాయి. కానీ దర్శకుడు బాబీ మాత్రం

బాలయ్యతో ఊహించనిదే చూపించబోతున్నాడని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ముఖ్యంగా సాలిడ్ లైన్ సినిమాకి తీసుకోగా ఇందులో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు దేనికదే హైలైట్ గా చూపించనున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఒకో యాక్షన్ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేయగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో బాలయ్యపై ఒక థగ్ లాంటి గెటప్ లో గుర్రంపై బీచ్ దగ్గర విలన్స్ మూకతో క్రేజీ సీక్వెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది సినిమాలో మామూలు లెవెల్లో ఉండదు అన్నట్టు తెలుస్తుంది. ఇలా మొత్తంగా అయితే బాలయ్య సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version