సమీక్ష : ‘హైడ్ అండ్ సీక్’ – బోరింగ్ క్రైమ్ డ్రామా !

Hide N Seek Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 20, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి త‌దిత‌రులు

దర్శకుడు: బసి రెడ్డి రానా

నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డి

సంగీత దర్శకుడు: లిజో కె జోష్

సినిమాటోగ్రఫీ: చిన్న రామ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

విశ్వంత్ హీరోగా.. శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘హైడ్ అండ్ సీక్’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

శివ (విశ్వంత్) మెడికల్ స్టూడెంట్. ఆర్మీలో డాక్టర్ గా జాయిన్ కావాలని తన ఫ్యామిలీకి కూడా తెలియకుండా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఐతే, శివ చదివే కాలేజీలోనే వర్ష (రియా సచ్ దేవ) కూడా చదువుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. వీరి పెళ్లికి వర్ష ఫ్యామిలీ కూడా ఒప్పుకుంటుంది. అయితే, మరోవైపు వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ?, వీటి వెనుక ఎవరు ఉన్నారు ?, ఈ మర్డర్ కేసులను పోలీస్ ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్) ఎలా విచారణ చేసింది ?, అసలు శివకి ఈ హత్యలకు మధ్య సంబంధం ఏమిటి ?, ఎందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు ? చివరకు ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విశ్వంత్, శిల్పా మంజునాథ్ తమ నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా శిల్పా మంజునాథ్ చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. ఇక సినిమాలో క్రైమ్ సన్నివేశాలు.. అదేవిధంగా ఆ క్రైమ్ జర్నీలో అనుకోని గేమ్ సంఘటనలతో వచ్చే సమస్యలు.., ఆ సమస్యల వలయంలో ప్రధాన పాత్రలు చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే ఆ కొన్ని సన్నివేశాలు జస్ట్ పర్వాలేదు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు బసి రెడ్డి రానా ఈ ‘గేమింగ్ క్రైమ్ జర్నీ’లో కొన్ని బలమైన వైల్డ్ మూమెంట్స్ పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. చాలా సన్నివేశాలు స్లోగా సాగాయి. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే క్రైమ్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. పైగా విలన్ క్యారెక్టర్ చాలా పాసివ్ గా ఉంది.

అదే విధంగా, రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో సాగే సీన్స్ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రధాన పాత్రల మధ్య ఉన్న కంటెంట్ ను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు బసి రెడ్డి రానా మాత్రం ఆ కంటెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. కథ కూడా చాలా సింపుల్ గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా వెరీ రెగ్యులర్ గా సాగింది.

మొత్తానికి ఈ ‘హైడ్ అండ్ సీక్’ సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా బాగాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. క్రైమ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని యాక్షన్ కంటెంట్ ను దర్శకుడు బసి రెడ్డి రానా బాగా తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. వర్కౌట్ కాలేదు. స్క్రిప్ట్ పరంగా కూడా దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. లిజో కె జోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను ‘చిన్న రామ్’ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అతని నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘హైడ్ అండ్ సీక్’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఆకట్టుకునే విధంగా సాగలేదు. కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ జస్ట్ ఓకే అనిపించినా.. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, గేమింగ్ నేపథ్యంలో సాగే బోరింగ్ అండ్ సిల్లీ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Exit mobile version