ప్రముఖ ఓటిటిలలో “కన్యక” చిత్రం స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్ లతో సహా పలు సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వస్తున్నా సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా శివరామరాజు, జబర్ధస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి, PVL వరప్రసాదరావు, సర్కార్ తదితరులు నటించారు. అయితే ఫణిసూరి విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైన చంపేసారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలోని ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది…

కన్యక ఏమైంది వచ్చిన అమ్మాయి ఎవరు చివరి వరకు అసలు ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో నడిచే ఈ సినిమా ని నకరికల్లు ప్రాంత వాసులైన నిర్మాతలు KV అమరలింగేశ్వరరావు ఆతుకూరి సాంబశివరావు కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పలు ప్రముఖ ఓటిటి యాప్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమింగ్, టాటా ప్లే, విఐ మూవీ తదితర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది. అయితే ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

వారు మాట్లాడుతూ మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలెట్ అని కుటుంబం మొత్తం కలిసి చూడగలిగిన చక్కని చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు రాఘవ మాట్లాడుతు ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించిన అమ్మవారు క్షమించదు శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని సినిమా చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేసామని షూటింగ్ కు నకరికల్లు మరియు చాగంటి వారి పాలెం వాసులు మాకు ఎంతో సహకరించారని చెప్పారు. మా ట్రైలర్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు

Exit mobile version