ANR100: మెగాస్టార్‌కు ANR లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

టాలీవుడ్ లెజెండరీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వర రావు శతజయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆయన తనయుడు, నటుడు అక్కినేని నాగార్జున ఈ సందర్భంగా ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు.

2024 సంవత్సరానికి గాను ఏఎన్నార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఇవ్వబోతున్నట్లు నాగార్జున అనౌన్స్ చేశాడు. ఈ అవార్డును అక్టోబర్ 28న బాలీవుడ్ నటుడు బిగి బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందజేస్తామని నాగార్జున తెలిపారు.

దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి కంగ్రాట్స్ చెబెతున్నారు. ఇక ఏఎన్నార్ ఎవర్‌గ్రీన్ చిత్రాలను ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పలు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version