ఫోటో మూమెంట్: ANR100 ఉత్సవాల కోసం కదిలొచ్చిన అక్కినేని కుటుంబం

లెజెండరీ నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకుని ANR శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు నేడు వారందరూ ఒకే వేదికపై కనిపించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఏఎన్నార్‌ను గౌరవిస్తూ ఓ స్టాంప్‌ను రిలీజ్ చేశారు. అంతేగాక, ఈ వేడుకలో అక్కినేని నాగార్జున ఏఎన్నార్ నేషనల్ అవార్డుపై ఆసక్తికర ప్రకటన చేశాడు. 2024కి గాను ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందజేయనున్నట్లు ఆయన తెలిపాడు.

ఇక ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొన్నారు. వారితో పాటు నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Exit mobile version