Devara: ఏపీలో “దేవర” బ్లాస్ట్.. వేట ఉదయం 12 నుంచే మొదలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 27న విడుదల కాబోతుండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎర్లీ షోస్ తోనే సినిమా మొదలవుతుంది అని స్ట్రాంగ్ రూమర్స్ వచ్చాయి.

అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ధరల పెంపు అలాగే అదనపు షోస్ కి అనుమతిని ఇస్తూ జీవోని విడుదల చేసింది. అయితే సెప్టెంబర్ 27 ఒక్క రోజుకి మాత్రం మొత్తం 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని అలాగే 27 రోజు మొదలు కావడం 12 గంటల తోనే దేవర షోస్ వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఏపీలో మాత్రం దేవర వేట ఉదయం 12 నుంచే మొదలు కానుంది అని చెప్పాలి.

Exit mobile version