తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా నజీరుద్దీన్ షేక్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాటల కాంపిటీషన్‌లో కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

అయితే, ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కార్యక్రమం ఎట్టకేలకు గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. దీంతో ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్‌గా ఎవరు నిలుస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వచ్చారు. 26 వారాలుగా సాగుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేత ఎవరనేది న్యాయనిర్ణేతలు తేల్చేశారు. టాప్-3 స్థానాల్లో పోటీ పడ్డ జివి శ్రీ కీర్తి, అనిరుధ్ సుస్వరం, నజీరుద్దీన్ షేక్‌లలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా నజీరుద్దీన్ నిలిచాడు.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మోటార్ మెకానిక్ కుమారుడైన నజీరుద్ధీన్ షేక్ తన గాత్రంతో ప్రేక్షకులతో పాటు న్యాయనిర్ణేతలను కూడా మెప్పించాడు. ఈ ట్యాలెంటెడ్ సింగర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ‘ఓజి’లో పాట పాడే అవకాశం కూడా దక్కించుకోవడం విశేషం. ఇక ఈ ప్రోగ్రాంకి థమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరించారు.

Exit mobile version