SWAG: ‘ఇంగ్లండు రాణి’గా రీతూ వర్మ.. అదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ‘ఇంగ్లండు రాణి’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రీతూ వర్మ ఈ సినిమాలో అనుభూతి అనే పాత్రలో నటిస్తుండగా, ఆమె పాత్రకు సంబంధించి ఈ పాట సాగుతుంది. ఈ పాటకు స్వరూప్ గోలి సాహిత్యాన్ని అందించగా కైలాష్ ఖేర్ అద్భుతంగా ఆలపించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది.

‘స్వాగ్’ చిత్రంలో శ్రీ విష్ణు నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version