రిహార్సల్స్ కి రెడీ అయిన మోక్షజ్ఞ

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలలు పాటు మోక్షజ్ఞ చేత రిహార్సల్స్ చేయించి, డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని టాక్. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే, ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి ‘దివంగత శ్రీదేవి’ చిన్న కూతురు ఖుషీ క‌పూర్ నటిస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version