యూఎస్ కి వెళుతున్న “తుంబాడ్” మ్యానియా

మన ఇండియన్ సినిమా నుంచి ఉన్నటువంటి పలు కల్ట్ చిత్రాల్లో బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రం “తుంబాడ్” కూడా ఒకటి. మరి దర్శకుడు అనీల్ రాహు బార్వె తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కి తీసుకొస్తే ఇప్పుడు ఆడియెన్స్ భారీ ఆదరణను అందించారు. ఇలా ఇప్పటికీ తుంబాడ్ మంచి వసూళ్లు రాబడుతుంది.

అయితే ఈ చిత్రం ప్రస్తుతానికి కేవలం ఇండియా లోనే రీ రిలీజ్ కి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమా యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేసేందుకు సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాని యూఎస్ మార్కెట్ లో సోహం షాహ్ ఫిల్మ్స్ వారు రీ రిలీజ్ కి తీసుకొస్తున్నారట. అయితే దీనిపై రిలీజ్ డేట్ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు అనిల్ రాహి బర్వె భారీ వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్” సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version