Jr NTR: ఫ్యాన్స్ కి సారీ చెప్తూ తారక్, “దేవర” టీం ఎమోషనల్ పోస్ట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అలా గ్రాండ్ ప్రమోషన్స్ నడుమ వస్తున్న ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో నోవెటల్ లో ప్లాన్ చేశారు కానీ అనుకోని కారణాలు రీత్యా దీనిని నిలిపివేయడం ఫ్యాన్స్ కి పెద్ద షాకింగ్ గా మారింది.

అయితే ఇలా నిలిపివేయడంపై తారక్ క్షమాపణలు చెబుతూ అభిమానుల కోసం ఒక స్పెషల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేయడం వైరల్ గా మారింది. అయితే తారక్ మాట్లాడుతూ నేను కూడా దేవర ప్రీ రిలీజ్ కోసం తన అభిమానులతో సినిమా విశేషాలు పంచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశానని కానీ అది సాధ్యపడలేదు. దీనికి ఎవరినీ బ్లేమ్ చెయ్యడానికి లేదు.

మీ అందరికంటే నాకే ఎక్కువ బాధగా ఉంది కానీ ఈ 27న మాత్రం థియేటర్స్ లో కలుద్దాం మీ అందరి ఆశీస్సులు నాకు మా చిత్రానికి కావాలి అని కొరటాల శివ చాలా కస్టపడి ఈ చిత్రాన్ని తీసాడు ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తారక్ తెలిపాడు. అలాగే ఈ సినిమా ఈవెంట్ నిలిపివేతపై మేకర్స్ కూడా విచారం వ్యక్తం చేశారు. మేము ఈరోజు కోసం ఆరేళ్ళ నుంచి ఎదురు చూసాము.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గణేష్ నిజ్జంగా సమయంలో రావడం, దానికి తోడు భారీ వర్షాలు కూడా చాలా దెబ్బ తీశాయి అని అందుకే ఏవి అనుకున్నట్టు జరగకపోవడం అభిమానులకి ఎంతో నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒకవేళ అవుట్ డోర్ ఈవెంట్ ని ప్లాన్ చేసినా కూడా భారీ జనసందోహం వచ్చేస్తారు దీనితో వారిని కంట్రోల్ చేయడం కూడా అసాధ్యం అని దేశ వ్యాప్తంగా మీ హీరోని చూసేందుకు ఎంతోమంది వచ్చారు.

మీరు అంతా మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారని ఆశిస్తున్నామని దేవదాసీ సినిమా యూనిట్ మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న దేవర ఈవెంట్ ఇలా ఆగిపోవడం అనేది అభిమానులకి మాత్రం కొంచెం బాధాకరంగానే ఉంటుంది అని చెప్పాలి.

Exit mobile version