‘అఖండ 2’ పాత్రల కోసం 3డి స్కెచెస్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో ‘అఖండ 2’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతానికి అయితే అఖండ 2 లో నటించే నటీనటుల కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నారు. పాత్రల గెటప్ అండ్ సెటప్ ల పై ప్రత్యేకంగా 3డి స్కెచెస్ వేయిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను బోయపాటి రాసినట్లు తెలుస్తోంది. మరి సంజయ్ దత్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇప్పటికే, ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా పై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Exit mobile version