ఆ స్టార్ హీరో కుమారుడు డైరక్షన్ వైపు !

స్టార్ హీరో కుమారుడు సహజంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. కానీ, హీరో రవితేజ‌ వారసుడు మహాధన్ భూపతిరాజు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. మహాధన్ ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నాడు. పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర మహాధన్ భూపతిరాజు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. ‘సందీప్ రెడ్డి డైరెక్షన్’ అంటే మహాధన్ కి చాలా ఇష్టం అట.

అందుకే, ఆయన దగ్గర సహాయకుడిగా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్ లో మహాధన్ డైరక్టర్ గానే సెటిల్ అవుతారో, లేక.. హీరోగా మారతారో చూడాలి. రవితేజ ఫ్యాన్స్ మాత్రం మహాధన్ భూపతిరాజు హీరో కావాలని పోస్ట్ లు పెడుతున్నారు. రవితేజ కూడా మొదట అసిస్టెంట్ డైరక్టర్ గా చేశాడని, అలాగే, మహాధన్ భూపతిరాజు కూడా ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరక్టర్ గా చేసినా, భవిష్యత్తులో కచ్చితంగా హీరో అవుతాడని ఫ్యాన్స్ మెసేజ్ లు పెడుతున్నారు.

Exit mobile version