‘కల్కి సీక్వెల్‌’ టైటిల్‌ పై క్రేజీ గాసిప్‌ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఎడి” బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ‘కల్కి సీక్వెల్’ పై అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ‘కల్కి సీక్వెల్ టైటిల్’కి సంబంధించి ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ‘కల్కి సీక్వెల్‌’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని ఈ పుకార్ల సారాంశం. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి. అందుకే, ‘కల్కి సీక్వెల్‌’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను పెడుతున్నారట.

పైగా కల్కి సీక్వెల్ లో కర్ణుడు, అశ్వద్ధామల మధ్య చాలా సన్నివేశాలు ఉంటాయని.. ముఖ్యంగా మహాభారత ఘట్టానికి సంబంధించి ‘కల్కి సీక్వెల్’ లో ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో.. ఇప్పటివరకు అయితే ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రటకన రాలేదు. అన్నట్టు వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి ‘కల్కి సీక్వెల్’ షూటింగ్‌ ను స్టార్ట్ చేయాలని నాగ అశ్విన్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Exit mobile version