Devara: ‘దేవర’తో ఆలియా ఇంటర్వ్యూ.. ప్రోమో అదిరింది!

‘దేవర’ మేనియాతో ప్రస్తుతం టాలీవుడ్ ఊగిపోతుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ నుంచి వస్తున్న ఈ యాక్షన్ డ్రామా మూవీలో ఎన్టీఆర్ ఎలాంటి విధ్వంసం చేయబోతున్నాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ తారా స్థాయిలో చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా ‘దేవర’ వస్తుండటంతో, ఈ చిత్రానికి సంబంధించి అన్ని భాషల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ‘దేవర’ క్రేజ్ పీక్స్‌లో ఉండటంతో ఈ చిత్రాన్ని అక్కడ పలువురు సెలెబ్రిటీలతో ప్రమోట్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్‌లు కలిసి ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ‘దేవర కా జిగ్రా’ అంటూ దేవర మూవీతో పాటు ఆలియా ‘జిగ్రా’ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఈ క్రేజీ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ‘దేవర’ సిద్ధమవుతున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version