క్రేజీ..ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో ప్రముఖ హీరో

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ప్రతీ సినిమాతో మంచి వ్యత్యాసం కనబరుస్తూ భారీ సినిమాలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లాస్ట్ సినిమాగా టాలీవుడ్ కి భారీ సూపర్ హీరో సినిమా అందజేసి రానున్న రోజుల్లో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు వస్తున్నట్టుగా ప్రామిస్ చేసాడు.

అయితే ఈ లైనప్ లో చాలా మంది స్టార్స్ కూడా కనిపించనుండగా ఇప్పుడు మరో ప్రముఖ హీరో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ యూనివర్స్ లో తమిళ ప్రముఖ హీరో కార్తీ నటిస్తున్నట్టుగా ప్రశాంత్ వర్మ తెలిపాడు.

అయితే తాను కార్తీ గారిని అప్రోచ్ అవ్వడం నిజమే అని ఇక ఆయన ఒప్పుకోవడమే మిగిలి ఉందని తను తెలిపాడు. అలాగే కార్తీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించడంపై సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రానుందో చూడాలి. ఇక కార్తీ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా “సత్యం సుందరం” ఈ సెప్టెంబర్ 28న మన తెలుగులో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version