Jr NTR: “దేవర”తో మ్యాన్ ఆఫ్ మాసెస్ మరో బిగ్గెస్ట్ రికార్డు.!

మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో నెలల తరబడి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ఆ సమయం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది.

అయితే ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలుసు. మరి ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ లెవెల్లో ఉంది. అయితే ఈ చిత్రంతో ఆల్రెడీ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ రికార్డ్స్ బుకింగ్స్, బెనిఫిట్ షోస్ ఫుల్స్ తోనే చూపిస్తుండగా లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ రికార్డుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని నార్త్ అమెరికా మార్కెట్ లో కొట్టిన రెండో హీరోగా తారక్ RRR, దేవర సినిమాలతో నిలిచాడు. మరి దీనికి ముందు ప్రభాస్ నటించిన భారీ చిత్రాలు “సలార్” అలాగే “కల్కి 2898 ఎడి” చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version