NBK 109: “బాలయ్య 109” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ 109వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా నందమూరి ఫ్యాన్స్ లో మాస్ హైప్ దీనిపై నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలోనే లేదా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారని బాలయ్య ఆ మధ్యలోనే చెప్పిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు బాలయ్య 109 రిలీజ్ కి ఫిక్స్ చేసిన డేట్ అంటూ ఒకటి వైరల్ గా మారింది. బాలయ్య 109 ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి దింపనున్నారట. దీనిపై అధికారిక అనౌన్సమెంట్ కూడా రానుంది అని తెలుస్తుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం జనవరి 9 అయితే బెటర్ అనే భావనలో ఉన్నారు.

మరి ఈ అవైటెడ్ చిత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో ఒక అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version