‘జటాధర’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్..!

నవదళపతి సుధీర్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫీల్ గుడ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’ను రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘జటాధర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.

టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన ‘జటాధర’ మూవీ నుంచి మేకర్స్ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాలోని పవర్స్‌కి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ‘జటాధర’ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా.. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తోంది. అటు లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ భామ రవీనా టండన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Exit mobile version