న్యాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. నాని పర్ఫార్మెన్స్ ఈ సినిమాను రిపీటెడ్‌గా చూసేలా చేసింది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చాటింది.
అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌న ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు(సెప్టెంబర్ 26) నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు కూడా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ చిత్రంలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.