మరో ఓటిటిలోకి కూడా వచ్చేసిన యూత్ ఫుల్ డ్రామా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’

యువ నటీనటులు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన రీసెంట్ చిత్రమే “ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143”. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. అయితే ఈ చిత్రం మొదటిగా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో అందుబాటులోకి రాగా ఇప్పుడు మరో ఓటిటిలోకి కూడా వచ్చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని థియేటర్ లో చూసిన వారికి ధన్యవాదాలు. చూడని వారికోసం ఒక శుభవార్త. మా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది” అని తెలిపారు. అలాగే ‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఫామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథ చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఆహా ప్రైమ్ వీడియో రెండిటిలో కూడా చూడవచ్చు.

Exit mobile version