“దేవర” డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “దేవర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ నుంచి దాదాపు ఐదేళ్ల తర్వాత వచ్చిన సోలో సినిమా ఇదే కావడంతో తారక్ మాస్ అంటే ఏంటో ఈ సినిమాకి చూపించాడు.

అలాగే వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. ఇలా ఒక్క తారక్ కెరీర్ లోనే కాకుండా మన ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ ఓపెనింగ్స్ దేవర కి దక్కేలా ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే కనిపిస్తుంది. ఇలా దేవర డే 1 ప్రిడిక్షన్ గా సాలిడ్ నెంబర్స్ వినిపిస్తున్నాయి. మరి దేవర అయితే వరల్డ్ వైడ్ గా ఈజీగా 100 కోట్ల మార్క్ దగ్గరకి వచ్చేస్తుంది అని తెలుస్తోంది. దీనితో తారక్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ సెట్ చేయనుంది అని చెప్పాలి. ఇక డే 2 నుంచి దేవర మాస్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

Exit mobile version