Devara: “దేవర” విధ్వంసం.. యూఎస్ లో లేటెస్ట్ భారీ వసూళ్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. మరి తారక్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం కొరటాలతో రెండో సినిమాగా వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు ఈ చిత్రం డే 1 కి అందుకుంటుంది. అయితే యూఎస్ మార్కెట్ లో దేవర కేవలం ప్రీ సేల్స్ లోనే రికార్డు గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు ఈ వసూళ్లపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

దీనితో అయితే ఈ చిత్రం ఒక్క నార్త్ అమెరికా నుంచే 2.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం క్రాస్ చేసింది. దీనితో ఈ చిత్రం డే 1 కి ఈజీగా 3 మిలియన్ డాలర్స్ ని టచ్ చేసేస్తుంది అని చెప్పొచ్చు. మరి చూడాలి దేవర యూఎస్ లో లాంగ్ రన్ కి ఎంత మార్క్ లో ఆగుతుంది అనేది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version