“వైభవం” నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

కొత్త నటీనటులు రుత్విక్, ఇక్రా ఇద్రిసి ప్రధాన పాత్రల్లో రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చిత్రం “వైభవం”. యువ ప్రతిభాశాలి సాత్విక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను మేకర్స్ రీసెంట్ గా విడుదల చేశారు.

మరి చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా… రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ అందిస్తామ‌ని దర్శకనిర్మాతలు తెలిపారు.

అలాగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఈ మొదటి పాత యూట్యూబ్ సహా పలు ఇతర సాంగ్స్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version