Kalki 2898 AD: బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కల్కి 2898 AD’ షోలు ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఎపిక్ సైఫై మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా, విజువల్ వండర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి 2898’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తన సత్తా చాటింది.

ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్‌గా వేయనున్నారు. అయితే, ఈ సినిమా ఎప్పుడు ప్రదర్శిస్తారనే విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 8, 9వ తేదీల్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేయనున్నారు. పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులు ఈ షోను వీక్షించనున్నారు.

ప్రభాస్ సరికొత్త లుక్‌లో నటించిన ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version