ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘35 – చిన్న కథ కాదు’

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మూవీ ‘35-చిన్న కథ కాదు’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. యంగ్ బ్యూటీ నివేదా థామస్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు నందకిషోర్ ఈమని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఇక మిడిల్ క్లాస్ జీవితాల రిఫరెన్స్ ఈ సినిమాను కామన్ ఆడియెన్స్‌కు దగ్గర చేసింది.

అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు, ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేశాడు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version