Devara: “దేవర” వసూళ్ల మోత.. యూఎస్ లో రికార్డు వసూళ్లు..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మరి తన ఫాలోయింగ్ కి తగ్గట్టు ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” చూపిస్తుంది. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి రోజు రికార్డ్ వసూళ్లు కొల్లగొట్టేసింది.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ తన స్టామినా చూపించాడు. ఇలా లేటెస్ట్ గా దేవర సినిమా యూఎస్ మార్కెట్ సంచలన వసూళ్లు అందుకుంది.

ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. డే 1 పూర్తి కాకుండానే దేవర ఈ రేంజ్ విలయ తాండవం చేస్తున్నాడని చెప్పాలి. మరి భారీ వసూళ్లు అందుకుంటున్న దేవర యూఎస్ మార్కెట్ లో ఇంకెలాంటి నంబర్స్ నమోదు చేస్తాడో చూడాలి.

Exit mobile version